- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సోషల్ మీడియాలో గోడ లెక్కించి పైకి లేపి ఫేమస్ చేస్తారు.. ఎత్తినంత సేపు ఉంచకుండా కింద పడేస్తారు.. ఏందిరా ఈ అన్యాయం?..

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. చిన్నా, పెద్దా, ముసలి, ముతకా అంటూ తేడా లేకుండా వాడిన కాడికి ఫుల్‌గా వాడేస్తున్నారు. అయితే ఎప్పుడు ఎవరూ ఫేమస్ అవుతారనేది మాత్రం ఊహకే అందడం లేదు. అలా ఇప్పటికే చాలా మంది సామాన్య ప్రజలు ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే వీరిని బాగా ఫేమస్ చేశారు అని ఆనందించే లోపు మళ్లీ అడ్రస్ లేకుండా చేసేస్తున్నారు. మళ్లీ ఎక్కడైనా కనిపించక పోతారా అని చూస్తుంటే పత్తా లేకుండా పోతున్నారు. ఇక వీటన్నింటిని చూసిన ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ఇక ఆ పోస్టును చూసినట్లయితే నిజమే అని అనక మానరు. మరి ఆపోస్ట్‌లో ఏముందో మనం ఓ సారి చూసేద్దాం..
‘కుమారీ ఆంటీని ఫేమస్ చేశారు!
హోటల్ లేకుండా పోయింది!!
బర్రెలక్కని ఫేమస్ చేశారు!
అడ్రస్ లేకుండా పోయింది!!
ఎవడో రాకేష్ మాష్టారుని ఫేమస్ చేశారు!
తాగించి వాగించి పైకి పంపారు!!
వేణు స్వామిని ఫేమస్ చేశారు!
అతగాడేమో వాని జాతకమే చూసుకోవడం మానేసాడు!!
పూసలమ్మే మోనాలిసాని ఫేమస్ చేశారు!
మూవీ డైరెక్టర్ జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు దేఖే వాడే లేడు!!
అఘోరీ అని ఒకడిని ఫేమస్ చేశారు!
వాడేమో ప్రేమ దోమ అని వెధవ అయ్యాడు!!
అలేఖ్య పచ్చళ్లమ్మే వాళ్లని ఫేమస్ చేశారు!
మొత్తం దుకాణమే సర్ధేసేలా చేశారు!!
సోషల్ మీడియా గోడ లెక్కించి పైకి లేపి ఫేమస్ చేస్తారు
ఎత్తినంత సేపు ఉంచకుండా కింద పడేస్తారు .. మీ తస్సాదియ్య... ఏందిరా ఈ అన్యాయం?.. Omg ఇంకా నెక్స్ట్ ఎవరో ఫేమస్ అయేది వాళ్ళ గతి ఏంటో
ఏమైంది రా మీ అందరికీ .. ప్రేమ గుడ్డిది.. సోషల్ మీడియా చెడ్డది’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.