దిశ ఎఫెక్ట్.. ఇళ్లు నేలమట్టం చేసిన అధికారులు..

by Javid Pasha |
దిశ ఎఫెక్ట్.. ఇళ్లు నేలమట్టం చేసిన అధికారులు..
X

దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలో స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు కబ్జాలు చేస్తున్నారంటూ.. 'దిశ' ఇచ్చిన కథనానికి అధికారులు శుక్రవారం స్పందించి చర్యలు తీసుకున్నారు. 57వ డివిజన్ కార్పొరేటర్ భర్త ముస్తఫా ఇచ్చిన సమాచారం మేరకు కార్పొరేటర్ అనుచరులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్లు ఆరోపణ రుజువయింది. దీనిపై విచారణ జరిపిన రెవెన్యూ, పోలీసు అధికారులు ఆక్రమణదారుల నుండి ప్రభుత్వ స్థలాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆక్రమణకు గురైన మూడు ఇళ్లను పొక్లెయిన్ సహకారంతో కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహశీల్దార్ శైలజ, ఆర్ఐలు పగడాల రాజేశ్, రవి, వీఆర్వో మస్తాన్, ఏస్పీ ఆంజనేయులు, సీఐ శ్రీధర్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed