ఏలియన్స్ చనిపోయారు.. శవపేటికలు తయారు చేసి..

by S Gopi |
ఏలియన్స్ చనిపోయారు.. శవపేటికలు తయారు చేసి..
X

దిశ, ఫీచర్స్ : 'ఏలియన్స్' ఉన్నారో లేదో చర్చ జరుగుతున్న క్రమంలో.. 1947 ప్రాంతంలో వాటిని చూశానన్న అమెరికన్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. న్యూ మెక్సికోలోని రోజ్‌వెల్‌ 1947 యూఎఫ్ఓ క్రాష్ జరిగిన సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను ఇందులో షేర్ చేశాడు. ఆ సమయంలో యూఎస్ మిలిటరీ ఒక నర్స్‌ను ఏలియన్స్‌కు పోస్టుమార్టమ్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చిందని, దీంతో ఆమె వెంటనే రిజైన్ చేసిందని చెప్పుకొచ్చాడు. రోజ్‌వెల్ ఫ్యునెరల్ హోమ్ ఎంప్లాయి అయిన గ్లెన్ డెన్నిస్ ఈ ఎక్స్‌పీరియన్స్‌ షేర్ చేసుకుంటూ.. ఇందుకు తానే సాక్ష్యమని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు గ్రహాంతర వాసుల కోసం చిన్న పిల్లల సైజ్ శవపేటికలను తయారు చేయాలని మిలిటరీ తమను ఆదేశించిందని పేర్కొన్నాడు. కాగా గతంలో మాజీ డిటెక్టివ్, మిలిటరీ పోలీస్ ఆఫీసర్ జేమ్స్‌ క్లార్క్‌సన్ గ్లెన్ డెన్నిస్‌ను ఇంటర్వ్యూ చేయగా.. ఈ విషయాలు బయటకు వచ్చాయి. సదరు వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో లేకున్నా.. ఏలియన్స్‌తో తన అనుభవాలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి.


Advertisement

Next Story

Most Viewed