VRA లతో ఆ పనిచేయించుకుంటున్న కలెక్టర్.. MRO ఉత్తర్వులపై సర్వత్రా విమర్శలు

by GSrikanth |   ( Updated:2022-04-12 06:57:06.0  )
VRA లతో ఆ పనిచేయించుకుంటున్న కలెక్టర్.. MRO ఉత్తర్వులపై సర్వత్రా విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థ రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే, వీరిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని ఇదివరకే సీఎం కేసీఆర్ హామీ ఇవ్వగా ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అయితే, వీఆర్ఓలు గ్రూప్-4 అధికారిగా కొనసాగే అవకాశం ఉన్నా.. వీఆర్ఏలను ఏ పోస్టుల్లో సర్దుబాటు చేయాలో కసరత్తు చేస్తున్నారు. అయితే, వీఆర్ఏలను రెవెన్యూ శాఖలో వివిధ పనుల్లో సహాయకులుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఉద్యోగ భద్రతపై ఆందోళనలో ఉన్న వీఆర్ఏలకు నిర్మల్ జిల్లాలో స్పెషల్ డ్యూటీలు వేయడం చర్చనీయాంశంగా మారింది.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వెలువడిన ఉత్తర్వులు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిర్మల్ జిల్లా కలెక్టర్ డ్యూటీతో పాటు క్రీడల్లోనూ అంతే చురుగ్గా ఉంటారు. ఆయన రెగ్యులర్‌గా టెన్నీస్ ఆడుతుంటారు. అయితే, టెన్నీస్ ఆడే సమయంలో కలెక్టర్‌కు బాల్ అందించేందుకు వీఆర్ఏలకు స్పెషల్ డ్యూటీ అలాట్ చేస్తూ నిర్మల్ అర్బన్ తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఏడుగురు వీఆర్ఏలకు రోజుకొకరి చొప్పున సాయంత్రం 5.30 గంటలకు చేరుకొని బాల్ బాయ్స్ డ్యూటీ చేయాల్సిందిగా సూచించారు. దీనిపై నెటిజన్లు, సామాజిక వేత్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.




Advertisement

Next Story

Most Viewed