వారిని ఎదుర్కోవడానికి కొత్త చట్టపరమైన నిర్మాణం అవసరం: కేంద్రమంత్రి

by Manoj |   ( Updated:2022-04-04 10:39:20.0  )
వారిని ఎదుర్కోవడానికి కొత్త చట్టపరమైన నిర్మాణం అవసరం: కేంద్రమంత్రి
X

న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లను ఎదుర్కోవడానికి కొత్త చట్టపరమైన నిర్మాణం అవసరమని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణోయ్ అన్నారు. దీంతో ఇది గోప్యత, భావప్రకటన స్వేచ్ఛ హక్కును సమతుల్యం చేసే అవకాశం ఉందని అన్నారు. అంతేకాకుండా సైబర్ స్పేస్‌లోని నిష్కపటమైన అంశాల నుండి సవాళ్లను ఎదుర్కొనేందుకు నిబంధనలు, నియంత్రణ కోసం డిమాండ్ చేస్తుందని చెప్పారు. సైబర్ క్రైమ్ దర్యాప్తు, డిజిటల్ ఫోరేన్సిస్ అంశంపై సీబీఐ ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు.

చాలా ఏళ్లుగా సాంకేతికత పెద్ద ఎత్తున ఉత్పాదకన, సామర్ధ్యత, సౌలభ్యాన్ని ఇచ్చిందని అన్నారు. అదే సమయంలో ఇతర వ్యక్తుల జీవితాలకు ప్రాణాంతకంగా, మోసపూరిత చర్యలకు పాల్పడే వారికి లక్ష్యంగా ఉందని చెప్పారు. చట్టపరమైన వ్యూహం, సాంకేతికత, సంస్థలు, సామర్థ్యం పెంపుదలతో పాటు పరస్పర సహకారంతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని ఆయన అన్నారు. అయితే మార్పు గణనీయంగా, ముఖ్యమైనదిగా, ప్రాథమికంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని తెలిపారు. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, యుఎస్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాల కేసులను ఉదహరిస్తూ, ఈ రోజు పెద్ద సంఖ్యలో చట్టపరమైన, సామాజిక జోక్యాలు జరుగుతున్నాయని అన్నారు.

అయితే, ఇవి ప్రాథమికంగా ఒక వైపు గోప్యత హక్కు, అవసరానికి మధ్య సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. మేము, భారతదేశంలో కూడా ఆ సామాజిక ఏకాభిప్రాయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సమర్థవంతమైన కొత్త చట్టం నిర్మాణం తీసుకొస్తే కాలానుగుణంగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా మన తరాల ఆకాంక్షలను సూచిస్తూ.. అలాగే ప్రజల మాటలను, సోషల్ మీడియాను జవాబుదారీగా ఉంచుతుందని చెప్పారు. కష్టపడి సంపాదించిన పొదుపులను మోసగించాలనుకునే వ్యక్తులను దూరంగా ఉంచుతుంది.



Advertisement

Next Story