- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్వచ్ఛభారత్ నిధుల విడుదలలో జాప్యం ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ
దిశ, ఏపీ బ్యూరో : స్వచ్ఛభారత్ నిధుల విడుదలకు ఎందుకు జాప్యం చేస్తున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ నిధుల విడుదలలో కొన్ని నిబంధనలను రూపొందించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వాటా మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచి కార్యక్రమాన్ని అమలు చేసే ఏజెన్సీకి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు 2020 మే 14న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లేఖ రాసినట్లు స్పష్టం చేశారు. అందువల్ల వాటా మొత్తాన్ని జమ చేసినట్లు తెలియజేయడంతో పాటు బడ్జెట్‌లోనూ ఈ మేరకు కేటాయింపులు జరగాలని తెలిపారు. అప్పుడే సత్వర నిధులు కేటాయింపుతో పాటు సమీక్ష కూడా జరుగుతుందని కేంద్ర జలశక్తి సహాయ శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.