NBK 109 మూవీ టైటిల్ తెలిస్తే పూనకాలు రావాల్సిందే.. బాబీ ప్లాన్ అదిరిందిగా..!

by Prasanna |   ( Updated:2024-10-29 07:45:48.0  )
NBK 109 మూవీ టైటిల్ తెలిస్తే పూనకాలు రావాల్సిందే.. బాబీ ప్లాన్ అదిరిందిగా..!
X

దిశ, వెబ్ డెస్క్ : అఖండ (Akhanda) మూవీ తర్వాత వచ్చిన బాలకృష్ణ (Balakrishna) తీసిన ప్రతీ కొత్త సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టింది. సంక్రాంతికి విడుదలైన వీర సింహారెడ్డి (Veera Simaha Reddy) మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డు క్రియోట్ చేసింది.

ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇక, ఇప్పుడు 109వ మూవీ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణలోని మాస్ యాంగిల్ ని అద్భుతంగా ప్రజెంట్ చేయడానికి డైరెక్టర్ బాబీ సిద్ధమవుతున్నాడు.

దీని గురించి ఫ్యాన్స్ కి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే, ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. " సర్కార్ సీతారాం "( Sarkar Sitaram )అనే టైటిల్ ను ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అక్టోబర్ 30న అధికారికంగా ప్రకటన ఇవ్వబోతున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం.

Advertisement

Next Story

Most Viewed