Nandamuri Kalyan Ram: వైజాగ్‌కు మకాం మార్చిన హీరో కళ్యాణ్ రామ్.. షాకింగ్ డెసిషన్‌కు కారణం ఇదే..!

by sudharani |   ( Updated:2024-10-25 11:31:30.0  )
Nandamuri Kalyan Ram: వైజాగ్‌కు మకాం మార్చిన హీరో కళ్యాణ్ రామ్.. షాకింగ్ డెసిషన్‌కు కారణం ఇదే..!
X

దిశ, సినిమా: నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. డెవిల్ (devil) సక్సెస్ తర్వాత.. ప్రస్తుతం ఆయన ‘NKR21’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఫుల్ యాక్షన్ (Full Action) బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కతోన్న ఈ మూవీతో ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilkuri) డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. అశోక క్రియేషన్స్ బ్యానర్‌పై అశోక్ వర్ధన్ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘NKR21’ నుంచి ఇప్పటికే వచ్చిన కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ (First Look) కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే.. ప్రజెంట్ కల్యాణ్ రామ్ వైజాగ్ (Vizag) లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘NKR21’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కతున్న ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ (Latest Schedule) వైజాగ్‌లో స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. షూటింగ్ (shooting) కు సంబంధించిన ఓ పిక్‌ను సోషల్ మీడియా (Social Media) వేదికగా షేర్ చేశారు. ఈ మేరకు ‘#NKR21 వైజాగ్‌కి తరలివచ్చింది. వైజాగ్‌లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం షూటింగ్ ప్రారంభించింది టీమ్. ఇందులో ప్రధాన తారాగణం అంతా పాల్గొంటుంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ (Schedule) లో టీమ్ కీలక సన్నివేశాలను తెరకెక్కించనుంది’ అంటూ తెలిపారు.




Advertisement

Next Story