- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'పోడు భూముల్ని టీఆర్ఎస్ సర్కార్ లాక్కుంటోంది'
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వంపై నల్లగొండ ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో పలుమార్లు ప్రస్తావించానని అన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపాదనను తాము కూడా అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. ఆ తీర్మానం తమకు చేరలేదని కేంద్రం స్పష్టం చేసిందని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని అంటున్నారని.. గిరిజన రిజర్వేషన్లపై కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. గిరిజనుల నుంచి పోడు భూముల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి ట్రైబల్ యూనివర్సిటీ రాలేదని ఉత్తమ్ మండిపడ్డారు. విషయం తప్పుదోవ పట్టించే విధంగా మంత్రి హరీశ్ రావు ఆరోపణలు చేయడం దారుణమన్నారు.