రెండోసారి మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం

by Mahesh |
రెండోసారి మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం
X

ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి గా వరుసగా రెండోసారి బీరేన్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం రాజధాని ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ లా గణేషన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఇక నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను, ఒకరు నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక, బిరేన్ సింగ్ రికార్డు స్థాయిలో ఐదో సారి హింగాంగ్ స్థానం నుంచి గెలుపొందారు. సుమారు 17 వేల పైచిలుకు ఓట్లతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి పై ఘన విజయం సాధించారు.

రెండు రోజుల క్రితం వరకు సీఎం ఎవరనే విషయమై స్పష్టత లేకపోయిన సంగతి తెలిసిందే. ఆదివారమే సీఎం అభ్యర్థిగా బీరేన్ సింగ్ ను ప్రకటించిన అధిష్టానం, మరుసటి రోజే ప్రమాణ స్వీకారం చేయించడం విశేషం. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ లతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ 32 స్థానాల్లో గెలుపొందింది.

Advertisement

Next Story