- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సహస్ర చండీ యాగం నిర్వహించిన ఎమ్మెల్సీ.. హాజరైన స్పీకర్ పోచారం
దిశ, మెదక్: సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి లక్ష్మీ సుభాష్ రెడ్డి దంపతులు మంజీరా నది జలాలు తీసుకొని వచ్చి గోమాత పూజలు నిర్వహించి యాగశాల ప్రవేశం చేసి అగ్ని ప్రతిష్ట యాగం శనివారం ఉదయం ప్రారంభించారు. మాధవానంద స్వామితో పాటు 150మంది ఋత్వికుల ఆధ్వర్యంలో చండీ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని సహస్ర చండీ యాగం పూజలు నిర్వహించారు. ఋత్వికులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి శాలువాతో సత్కరించారు. హావేలిఘనాపూర్ మండలంలోని కుచన్ పల్లి గ్రామంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో లోకకళ్యాణార్థం శ్రీ రుద్ర స్వాహాకారపూర్వక సహస్ర చండీ మహాయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, హవేలి ఘణాపూర్ మండల ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, పుట్టి అక్షయ్ కుమార్ స్థానిక సర్పంచ్ దేవాగౌడ్, ఉప సర్పంచ్ బయ్యన్న తదితరులు ఉన్నారు.
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ.. వాణి దేవి
సహస్ర చండీ యాగానికి ఎమ్మెల్సీ వాణి దేవి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద బ్రాహ్మణులకు, ఋత్వికులు ఎమ్మెల్సీకి ఆశీర్వచనాలు అందించారు. మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో ఈ యాగ నిర్వహణ జరుగుతోంది. అంతేకాకుండా ఆ యాగం 5 రోజుల పాటు కొనసాగనుంది. యాగానికి హాజరైన భక్తులకు బోజన సదుపాయం కల్పించారు. భక్తులు, రాజకీయ నాయకులు భారీగా యాగశాలకు తరలి వచ్చారు.