మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

by S Gopi |   ( Updated:2022-03-06 10:19:59.0  )
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
X

దిశ, ముధోల్ రురల్: మహిళలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో గుర్తింపు ఉంటుందని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాల అద్దె కేంద్రం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మండల సమైక్య రుణాల చెల్లింపు రికవరీలో రాష్ట్ర స్థాయిలోనే వరుసగా నాలుగుసార్లు అవార్డు అందుకోవడం అభినందనీయమన్నారు.

రూ. 17 లక్షల 91 వేలతో వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలోనే సూపర్ మార్కెట్లు సైతం ఏర్పాటు చేస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని తెలిపారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎంపీపీ అయేషా ఆఫ్రోజ్ ఖాన్, స్థానిక సర్పంచ్ వెంకటాపురం రాజేందర్, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ గోవిందరావు, డీపీఎం శోభారాణి, ఆర్ఎమ్ రాందాస్, మండల సమాఖ్య అధ్యక్షురాలు నాగమణి, ఏపీఎం అశోక్, సీసీలు వందేమాతరం, సంజీవ్, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed