- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయసాయిరెడ్డితో ఎమ్మెల్యే రోజా కీలక భేటీ.. అందుకేనా ?
దిశ, వెబ్‌డెస్క్ : నగరి ఎమ్మెల్యే రోజా .. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ అనుబంధ సంఘాల ఇంచార్జీ విజయసాయిరెడ్డితో సమావేశమయ్యారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వీరు భేటీ అయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించేందుకు సమావేశమయినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ భేటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పార్టీ బలోపేతం దృష్టి పెట్టాలని.. ఎమ్మెల్యేలు ప్రజలదగ్గరకు వెళ్లాలని సూచించారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. మరోవైపు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహిస్తామని.. పనితీరు మార్చుకోకపోతే టికెట్ ఇవ్వబోమని హెచ్చరించారు. మంత్రి మండలిలో సమూల మార్పులు ఉండబోతున్నట్టు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోజా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నారా? లేక మంత్రి మండలిలోకి తీసుకోబోతున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ కీలక నేత విజయసాయిని కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.