బస్ షెల్టర్‌కు రూ.10 లక్షలు.. కేవలం ఆయన లాభం కోసమే..?

by Satheesh |
బస్ షెల్టర్‌కు రూ.10 లక్షలు.. కేవలం ఆయన లాభం కోసమే..?
X

దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పీఎస్పీడీ కర్మాగార సీఎస్ఆర్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తు్న్నాయి. ఇందుకు కారణం ఇరవెండి గ్రామంలో నిర్మించే బస్ షెల్టర్. కేవలం ఐదుగురు కూర్చునే బస్ షెల్టర్ నిర్మాణానికి రూ.10 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇది కేవలం కాంట్రాక్టర్ స్వలాభం కోసమే నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, గతంలో ఇదే స్థలంలో ఉన్న బస్ షెల్టర్‌ను ఎందుకు కూల్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయిన ఈ బస్ షెల్టర్ ప్రయాణికుల కంటే యాచకుల అడ్డాగా మారిందని.. గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. బస్ షెల్టర్ పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story