- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Fishing Technology : వావ్.. చేపలు పట్టడం ఇంత ఈజీనా..? ఈ టెక్నిక్ చూశారా?

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యానికి అతి ముఖ్యమైన ఆహారాల్లో చేపలు కూడా ఒకటి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మన దేశంలో అయితే చేపలు పట్టడం ఒక ప్రధాన వృత్తిగా, జీవనాధారంగా కలిగి ఉన్నవాళ్లు చాలామందే ఉంటారు. కాగా ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికత వచ్చి పనులను సులభతరం చేస్తోంది. ప్రస్తుతం చేపల వేటకు అవసరమయ్యే టెక్నాలజీ కూడా వచ్చింది. అలాంటి ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దామా?
వైరల్ సమాచారం ప్రకారం.. @Chinnuforyou134 అనే పేరుగల ‘యూట్యూబ్ షార్ట్ వీడియోస్’ యూజర్ ఒక వీడియోను షేర్ చేశాడు. దీని ప్రకారం.. చేపలను ఈజీగా పట్టేందుకు ప్రస్తుతం కనామా స్మార్ట్ బాట్ అనే ఒక డివైజ్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా చేపలను సులభంగా పట్టవచ్చు. ఎలాగంటే.. ఈ పరికరాన్ని చనిపోయిన చేప నోటిలో పెట్టి, నీటిలో వదిలితే చాలు. అది బతికి ఉన్న చేపమాదిరి కదలడం లేదా ఈదడం మొదలు పెడుతుంది. అంటే చనిపోయిన చేపను బతికి ఉన్నట్లు చూపించి, పెద్ద చేపలను వలలో వేయడం కోసం దీనిని ఉపయోగించవచ్చు. ఇది ఒకసారి నీటిలో వదిలాక మూడు గంటలకంటే ఎక్కువ సమయం పనిచేసే బ్యాటరీని కలిగి ఉంటుంది.
కనామా స్మార్ట్ బాట్ డివైజ్ చేపలను పట్టేందుకు 300 మీటర్లకంటే ఎక్కువ లోతుకు వరకు కూడా వెళ్లి పెద్ద పెద్ద చేపలను అట్రాక్ట్ చేసే ఒక ఫ్రీక్వెన్సీని(ధ్వనిని) రిలీజ్ చేస్తుంది. దీంతో అది బతికి ఉన్న చేప అనుకొని నీటిలో ఉండే టోనా పెద్ద పెద్ద చేపలు ఒకే దగ్గరకు చేరి, అప్పటికే సిద్ధంగా ఉంచిన వలలో చిక్కుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో చేపలను పట్టడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చైనా సహా పలు దేశాల్లో ఇంతకంటే మెరుగైన అధునాతన ఫిషింగ్ టెక్నాలజీ ఉందని నిపుణులు చెబుతున్నారు.