- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రియుడితో ఊరి ప్రెసిడెంట్ జంప్.. భర్త, పిల్లలు ఉండగానే అలా చేసి..
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలకు అడ్డే లేకుండా పోతుంది. పెళ్లై, పిల్లలు ఉన్నారని కూడా మర్చిపోయి దారుణానికి ఒడిగడుతున్నారు కొందరు. కట్టుకన్న భర్తను, నవమాసాలు మోసి కని పెంచిన కన్న బిడ్డలను వదిలి ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. ముగ్గురు పిల్లలు, కట్టుకున్న భర్తను వదిలి ఓ మహిళ వేరే అబ్బాయితో జంప్ అయిన ఘటన తాజాగా బీహీర్ లో చోటు చేసుకుంది. అయితే మహిళ ఓ బిజినెస్ మ్యాన్‌ని వివాహం చేసుకుంది. ఎంతో అన్యోన్యంగా వీరి కాపురం సాగింది. దీంతో వీరికి ముగ్గురు పిల్లలు సంతానం అయ్యారు. మహిళ ఊరికి ప్రెసిడెంట్.
సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అలా ఎవరు ఎప్పుడు మారుతారో ఎవరికీ తెలియదు. అలా మహిళ ఆ ఊరికి సంబంధించిన అబ్బాయిని ప్రేమించింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరి ప్రేమ మారిపోయింది. దీంతో వారు అప్పుడప్పుడు కలుస్తూ.. సహజీవనం చేసేవారు. అయితే వీరు కలవడానికి పిల్లలు, భర్త అడ్డుగా ఉండటంతో మహిళ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రేమించిన అబ్బాయితో కలిసి పారిపోయింది. మహిళ కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఊరి ప్రెసిడెంట్ జంప్ అవ్వడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.