మెస్సీతో బలవంతంగా సెల్ఫీ.. షాక్‌లో దిగ్గజ ఆటగాడు

by Vinod kumar |   ( Updated:2023-03-30 17:55:06.0  )
మెస్సీతో బలవంతంగా సెల్ఫీ.. షాక్‌లో దిగ్గజ ఆటగాడు
X

బ్యూనస్ ఎయిర్స్: మితిమీరిన అభిమానం సెలబ్రిటీలకు ఒక్కోసారి శాపంగా మారుతుంటుంది. తాజాగా దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ అభిమాని ఏకంగా సెక్యూరిటీని ఛేదించుకుని వచ్చి మైదానంలో సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉన్న మెస్సీ మెడను గట్టిగా పట్టుకుని వీడియో తీయడం తో పాటు సెల్ఫీ దిగాడు. అనంతరం ఆ వీడియోను తన వ్యక్తిగత ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది.


ఈ ఘటన ఈక్వెడార్, అర్జెంటినా సందర్భంగా చోటుచేసుకుంది. మ్యాచ్ 1-1తో డ్రాగా ముగియడంతో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ చొక్కా లేకుండా సెలబ్రేట్ చేసుకుంటుండగా ఆకస్మాత్తుగా వచ్చిన అభిమాని మెస్సీ మెడపై చేయి వేసి గట్టిగా పట్టుకుని సెల్ఫీ వీడియో తీశాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న క్రీడాకారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలియక మెస్సీ కూడా కొన్ని సెకన్ల పాటు షాక్‌లోనే ఉండిపోయాడని సమాచారం. అనంతరం పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని బలవంతంగా బయటకు తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నట్టు తెలిసింది.

Advertisement

Next Story