దారుణం.. ప్రాణం తీసిన మద్యం మత్తు..

by Satheesh |
దారుణం.. ప్రాణం తీసిన మద్యం మత్తు..
X

దిశ, ముషీరాబాద్: మద్యానికి బానిసై.. కుటుంబ సభ్యులతో తరచూ గొడవల కారణంగా మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కవాడిగూడ డివిజన్ ఎన్టీఆర్ స్టేడియం భీమా మైదానం బస్తీలో నివసించే వి. సాయి కుమార్ ( 28 ) వృత్తిరీత్యా వెల్డింగ్ పని చేస్తుండేవాడు. మద్యానికి బానిసైన సాయి కుమార్‌కు తరచూ భార్యతో గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమినించిన కుటుంబ సభ్యులు గాంధీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.


Advertisement

Next Story