Nirmal: కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

by Hajipasha |   ( Updated:2022-08-01 12:34:51.0  )
Man Attempts Suicide In Nirmal Collectorate
X

దిశ,నిర్మల్ కల్చరల్: Man Attempts Suicide In Nirmal Collectorate| కలెక్టర్ కార్యాలయంలో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సోన్ మండలం సంగంపేట్ గ్రామానికి చెందిన గొర్రె లింగన్న అనే వ్యక్తికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గ్రామ వీడీసీ సభ్యులు కక్ష సాధింపు చర్యలు చేపట్టి భూమి చుట్టూ కందకం ఏర్పాటుచేసి దారి వేశారని ఆరోపించారు. ఈ విషయంపై గత నాలుగు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, ఎవరు సమస్యను పట్టించుకోవడం లేదని లింగన్న ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో అదనపు కలెక్టర్ రాంబాబును కలిసి సమస్యను విన్నవించారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని, చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులకు ఊరట..

Advertisement

Next Story