బాలీవుడ్‌ నటుడితో ప్రేమాయణం.. 49 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్?

by Hamsa |   ( Updated:2024-11-04 07:29:36.0  )
బాలీవుడ్‌ నటుడితో ప్రేమాయణం.. 49 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్?
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు(Celebrities) ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్న విషయం తెలిసిందే. 40 ఏళ్లు పూర్తి అయినప్పటికీ పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలాంటి వారిలో స్టార్ హీరోయిన్ నగ్మా(Nagma) కూడా ఒకరు. చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌తో పాటు సీనియర్‌ హీరోలందరితో నటించి సక్సెస్‌ ఫుల్ హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

కొద్ది కాలంపాటు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. కానీ కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరం అయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక నగ్మా(Nagma) పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె 49 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి(marriage) చేసుకోలేదు. కొంతమందితో డేటింగ్ చేసినట్లు ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఏ రిలేషన్ పెళ్లి దాకా వెళ్లలేదు. దీంతో ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే సింగిల్‌గా ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, నగ్మా పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఓ బాలీవుడ్‌ హీరో(Bollywood Hero)తో ప్రేమలో ఉన్నట్లు టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి(marriage) చేసుకోబోతున్నట్లు నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story