- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ హామీపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో 111 తొలగిస్తే ఆయన పేరుమీద గుడిలో వెయ్యి కొబ్బరి కాయలు కొడతానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నిపుణుల కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తామని ప్రకటించారు. అయితే, దీనిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్విట్టర్ వేదికగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ 2013లో తాను టీఆర్ఎస్‌లో చేరిన రోజునుంచి జీవో 111ను తొలగిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారని.. టీఆర్ఎస్‌ను వీడిన అనేక కారణాల్లో ఇది కూడా ఒకటని ఆయన అన్నారు. కేసీఆర్ జీవో 111 రద్దు చేస్తే గుడిలో వెయ్యి కొబ్బరి కాయలు కొడతానన్నారు. అంతేగాకుండా, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు పీఆర్ఎల్ఐఎస్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామన్న హామీని కూడా నెరవేరుస్తే ఆయన పేరు మీద 10వేల కొబ్బరి కాయలు కొడతానంటూ ఆసక్తిక ట్వీట్ చేశారు.