శ్రీలంక సిరీస్‌కు కోహ్లీ, పంత్ దూరం..! వెస్టిండీస్ మూడో టీ20కి సైతం

by Disha News Desk |
శ్రీలంక సిరీస్‌కు కోహ్లీ, పంత్ దూరం..! వెస్టిండీస్ మూడో టీ20కి సైతం
X

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది. దీంతో శనివారం వీరిద్దరూ బయోబబుల్‌ను వీడి ఇంటి దారి పట్టినట్టు బీసీసీఐ అధికారి ఒకరు శనివారం అధికారికంగా ప్రకటించారు. తాజా ప్రకటనతో కోహ్లీ, పంత్ వెస్టిండీస్‌తో జరిగే మూడో టీ20తో పాటు శ్రీలంకతో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు దూరం కానున్నారు.

శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టీ20లో కోహ్లీ, పంత్ చెరో అర్ధ సెంచరీ బాది జట్టు విజయంలో కీలక భూమికను పోషించిన విషయం తెలిసిందే. భారత్ ఎలాగూ టీ20 సిరీస్‌ను 2-0తో గెలుచుకున్నందున ఆటగాళ్లపై పని ఒత్తిడి తగ్గించి, మానసిక ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని అందించేందుకు నిబంధనల ప్రకారం సెలవులు వచ్చినట్టు బీసీసీఐ స్పష్టం చేసింది.

Advertisement

Next Story