- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రెడిట్ కార్డు ఉంటే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది!
ముంబై: గత పదేళ్లలో ఖర్చు చేసే విధానంలో వచ్చిన మార్పులతో క్రెడిట్ కార్డులను వినియోగించడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఇప్పటికీ దేశంలోని చాలా మందికి క్రెడిట్ కార్డులను వాడటమే కానీ దాని గురించి పూర్తి అవగాహన తక్కువే అని చెప్పాలి. కొందరికీ క్రెడిట్ కార్డును ఎలాంటి అవసరాలకు ఉపయోగించాలో తెలియదు, మరికొందరికీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ విధానం గురించి తెలియదు. ఇంకా కొందరు స్నేహితులో, బంధువుల వద్దో ఉందని తీసుకోవడమే కానీ ఎందుకు తీసుకుంటున్నారో గమనించరు. అయితే, క్రెడిట్ కార్డు విషయంలో ఇలాంటి పద్దతి సరైంది కాదని, ఆర్థిక అవసరాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయని, దానికి అనుగుణంగా వినియోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ఎంతో కొంత అవగాహన ఉండి, సరైన ఆర్థిక అవసరం కోసమే క్రెడిట్ కార్డు వాడుతున్న వారు కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేయడం సహజం. క్రెడిట్ కార్డు వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒకసారి క్రెడిట్ కార్డుకు అలావాటు పడిన తర్వాత అనేక అలవాట్లకు దాన్ని వాడేస్తుంటారు. దీనివల్ల ఆర్థిక పరమైన అవసరాల్లో గందరగోళమే తప్పించి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.
ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్న వారు ప్రతి నెలా తమకు వచ్చే స్టేట్‌మెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈమెయిల్, కొరియర్, కొన్నిసార్లు రెండు పద్దతుల్లోనూ స్టేట్‌మెంట్ వినియోగదారులకు అందుతుంది. లేదంటే నెట్ బ్యాంకింగ్ నుంచి ఆన్‌లైన్ స్టేట్‌మెంట్ చూసే వెసులుబాటు ఉంటుంది. క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ అనేది వినియోగదారుడి కార్డు వినియోగానికి సంబంధించి పూర్తి వివరాలు అందులో పొందుపరిచి ఉంటాయి. ఇందులో బిల్లింగ్ చేసిన కాలవ్యవధి, కొనుగోళ్లు, చెల్లింపులు, రివార్డ్ పాయింట్లు, క్రెడిట్ బ్యాలెన్స్ సహా అనేక వివరాలు ఉంటాయి. ఈ వివరాలన్నీ తెలుసుకునేందుకు స్టేట్‌మెంట్ మొత్తాన్ని పూర్తిగా చదవాల్సి ఉంటుంది. అయితే, కొందరు పూర్తి వివరాలను పట్టించుకోరు. ఎంత చెల్లించాలో చూసుకుని మర్చిపోతుంటారు. దీనివల్ల ఆర్థిక పరమైన క్రమశిక్షణ గాడి తప్పుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు స్టేట్‌మెంట్‌లో ఏదోక లావాదేవీ, చెల్లింపులో పొరపాటు ఉంటే అనవసరంగా ఎక్కువ మొత్తంలో నష్టాన్ని వినియోగదారుడు భరించాల్సి వస్తుంది. కాబట్టి క్రెడిట్ కార్డు ఉన్నవారు తప్పనిసరిగా స్టేట్‌మెంట్‌ను పూర్తిగా చదివి, తప్పుల ఉన్నాయేమోనని సరిచూసుకోవడం మంచిది. ఏవైనా తప్పులు జరిగితే బ్యాంకును సంప్రదించాలి. దీనికోసం ముందుగా క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌కు సంబంధించి కీలకమైన అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
స్టేట్‌మెంట్ గడువు..
ముందుగా క్రెడిట్ కార్డుకు సంబంధించి చెల్లింపుల గడువు తేదీ, స్టేట్‌మెంట్ గడువు తేదీలని తప్పనిసరిగా గుర్తించుకోవాలి. స్టేట్‌మెంట్ గడువు తేదీ అంటే క్రెడిట్ కార్డు దారుడి స్టేట్‌మెంట్ జనరేట్ అయిన తేదీ. దీనివల్ల స్టేట్‌మెంట్ అనేది ఎప్పుడు సిద్ధమయ్యింది, బిల్లింగ్ ఏ తేదీ నుంచి మొదలైంది అనే కీలక విషయాలు తెలుస్తాయి.
చెల్లింపుల గడువు..
ఇది క్రెడిట్ కార్డు బకాయి మొత్తాన్ని కార్డు జారీ చేసిన బ్యాంకుకు చెల్లించాల్సిన తేదీ. క్రెడిట్ కార్డు ఉన్నవారు చెక్ రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వదలుచుకుంటే, క్లియరెన్స్ కోసం కనీసం 2-3 రోజుల సమయం పడుతుందని గుర్తించుకోవాలి.
గ్రేస్ పీరియడ్..
చెల్లింపు గడువు తేదీ అనంతరం మూడు రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయం తర్వాత కూడా బకాయిని చెల్లించకపోతే, ఆ మొత్తంపై లేట్-ఫీజు కింద వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయం తర్వాతి నెలలో వచ్చే స్టేట్‌మెంట్‌లో కనిపిస్తుంది. కొన్ని క్రెడిట్ కార్డు ఇచ్చే బ్యాంకులు గ్రేస్ పీరియడ్‌ను 25 రోజుల వరకు కూడా ఇస్తున్నాయి.
ఎంత మొత్తం చెల్లించాలి..
స్టేట్‌మెంట్ ఏ నెలకు సంబంధించి ఖర్చు చేసిన వివరాలు మాత్రమే కాకుండా ఎంత వడ్డీ అమలైంది, ఆలస్యంగా చేసిన చెల్లింపునకు వర్తించే ఛార్జీలు, అంతకుముందు బిల్లులో చెల్లింపు మొత్తం, సేవల ఛార్జీలు, లావాదేవీ ఫీజు, క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు ఇలా చెల్లించాల్సిన మొత్తం వర్తిస్తాయి.
లావాదేవీ వివరాలు..
బయటగానీ, ఆన్‌లైన్‌లో కానీ క్రెడిట్ కార్డు ద్వారా చేసిన అన్ని లావాదేవీలు, ఏ రోజున లావాదేవీ జరిగింది, ఎంత మొత్తం సహా పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. అన్నిటినీ పూర్తిగా నిదానంగా పరిశీలించడం మంచిది. ఏ లావాదేవీలోనూ పొరపాట్లు లేవని ధృవీకరించుకోవాలి. దీనివల్ల ఒక నెలలో క్రెడిట్ కార్డు ద్వారా ఎంత ఖర్చు చేస్తున్నారు, గతంతో పోలిస్తే ఖర్చు పెరిగిందా లేదా అనేది ఇందులో తెలుస్తాయి. ఈ అంశాలను పరిశీలించడం వల్ల ఖర్చు చేసే అలవాటు పై అవగాహన ఏర్పడుతుంది. భవిష్యత్తులో పొదుపు చేసేందుకు ఖర్చులను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది.
మినిమమ్ డ్యూ..
కొన్నిసార్లు క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం చెల్లించలేని పరిస్థితిలో ఉంటే లేట్ ఫీజు నుంచి ఉపశమనం కోసం మినీమ్ డ్యూ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. మామూలుగా అయితే ఇది చెల్లించాల్సిన మొత్తంలో 5 శాతం ఉంటుంది. అయితే, మినిమమ్ డ్యూ చెల్లించిన తర్వాత కూడా బకాయి ఉన్న దాన్ని చెల్లించే వరకు వడ్డీ వర్తిస్తుందని గుర్తించుకోవాలి. మినిమమ్ డ్యూ అనేది లేట్ ఫీజు పడకుండా ఉండేందుకే అని మర్చిపోకూడదు.
క్రెడిట్ పరిమితి..
ఇది క్రెడిట్ కార్డుపై బ్యాంకు నిర్ధారించిన పరిమితి, క్రెడిట్ కార్డు ద్వారా గరిష్టంగా ఎంత ఖర్చు చేయాలో చూపిస్తుంది. క్రెడిట్ కార్డ్ పరిమితిని ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఎప్పుడైనా సవరించుకునే వెసులుబాటు ఉంటుంది.
రివార్డు పాయింట్లు..
క్రెడిట్ కార్డును ఎక్కువమంది వినియోగించడానికి ప్రధాన కారణాల్లో రివార్డు పాయింట్లు ఎంతో కీలకం. లావాదేవీలు, చెల్లింపులపై లభించే క్రెడిట్ పాయింట్లకు కూడా కొంత గడువు ఉంటుంది. ఆ సమయంలోపు వాటిని వినియోగించుకోవాలి. లేదంటే గడువు తేదీ తర్వాత రద్దవుతాయి. కాబట్టి క్రెడిట్ పాయింట్లను గమనించి రెడీమ్ చేసుకోవడం ఉత్తమం. వీటిని సరైన అవగాహనతో వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడతారు.
బిల్లింగ్ సైకిల్..
రెండు స్టేట్‌మెంట్ తేదీల మధ్య ఉన్న కాలాన్ని బిల్లింగ్ సైకిల్ అంటారు. మామూలుగా బిల్లింగ్ సైకిల్ అనేది 30 రోజుల వ్యవధి గా పరిగణించబడుతుంది. ఈ 30 రోజుల వ్యవధిలో నిర్వహించే లావాదేవీలన్నీ స్టేట్‌మెంట్‌లో ఉంటాయి. బిల్లింగ్ సైకిల్ అనేది అందరికీ ఒకే విధంగా ఉండదని గమనించాలి. క్రెడిట్ కార్డు ఇచ్చిన బ్యాంకును బట్టి ఇది మారుతుంది.
ముఖ్యమైన సమాచారం..
స్టేట్‌మెంట్‌లో కీలకమైన అంశం ఇది. బ్యాంకులు సమయానుసారం వడ్డీ రేట్లు, వినియోగానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేస్తే ఇందులో తెలుసుకునే వీలుంటుంది. ఈ విభాగంలో అన్ని వివరాలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవడం తప్పనిసరి.
మీకు SBI అకౌంట్ ఉందా.. ఉంటే, వెంటనే డబ్బులు డ్రా చేసుకోండి!