మీడియం రేంజ్ మిసైల్ రెండు పరీక్షలు విజయవంతం

by Harish |   ( Updated:2022-03-30 11:49:20.0  )
మీడియం రేంజ్ మిసైల్ రెండు పరీక్షలు విజయవంతం
X

భువనేశ్వర్: భారత్ మీడియం రేంజ్ మిసైల్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలసోర్‌లో బుధవారం రెండు ప్రయోగాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 'భూ గగనతల మీడియం రేంజ్ ఆర్మీ ఆయుధ వ్యవస్థ మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. నిర్ణీత సమయాలలో నిర్దేశించిన సమయాల్లో లక్ష్యాలను చేరుకుంది' అని ప్రకటనలో పేర్కొంది. మిసైల్స్‌తో కలిపి అన్ని ఆయుధ వ్యవస్థలు, రాడార్, కమాండ్ పోస్ట్ ట్రయల్స్ సమర్థవంతంగా పనిచేశాయని వెల్లడించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత ఆర్మీకి చెందిన సీనియర్ అధికారులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఈ నెల 27న కూడా మిసైల్ పరీక్ష విజయవంతమైన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story