- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Andhra News: త్వరలోనే ఆధార్‌లో మారనున్న జిల్లాల అడ్రస్‌లు..?

దిశ, వెబ్‌డెస్క్: Andhra News| ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం జిల్లాల పునర్ విభజన చేసిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న జిల్లాలతో పాటు కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేశారు. దీనితో ఏపీ చాలా మందికి ఆడ్రస్‌లు మారి.. కొత్త సమస్య వచ్చింది. సంక్షేమ పథకాలు అమలు చేయడానికైన, వాటిని రూపొందించడానికైనా ప్రామాణికమైన ఆధార్ కార్డులో పాత అడ్రస్ ఉండటంతో ప్రజలకు కొత్త సమస్య వచ్చింది.
అయితే ఆధార్‌లో పాత జిల్లాల ప్లేస్‌లో, కొత్త జిల్లాల పేర్లు మార్పు చేసే విషయమై ఏపీ సీసీఎల్‌ఏ కార్యదర్శి బాబు, అధీకృత సంస్థతో మంగళవారం చర్చించినట్లు తెలిపారు. అయితే మండలం, పిన్‌కోడ్ మ్యాపింగ్ ద్వారా మార్పులు చేస్తే ఆధార్‌లో జిల్లాల పేర్లు వాటంతటవే మారేలా చేయోచ్చని ఆయన పేర్కొన్నారు. కానీ ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని, ఇంకా ఆమోదించలేదని.. ప్రస్తుతానికి ఆధార్‌లో పాత అడ్రస్ ఉంటుందని చెప్పారు.