మద్యం మత్తులో క్రికెటర్ విధస్వం.. వాళ్లే నన్ను రక్షించారు: చాహల్

by Javid Pasha |
మద్యం మత్తులో క్రికెటర్ విధస్వం.. వాళ్లే నన్ను రక్షించారు: చాహల్
X

ముంబై : టీమిండియా బౌలర్ యుజువేంద్ర చాహల్ ఎవరికీ తెలియని విషయాన్ని బహిర్గతం చేశాడు. 2013 ఐపీఎల్ టోర్నీ సందర్భంగా ఓ క్రికెటర్ తనను 15వ అంతస్తులో వేలాడదీశాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయంలోకి రావడంతో క్రికెట్ అభిమానులు అతని పేరు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీసీసీఐ కూడా ఈ విషయంపై సీరియస్ అవ్వడమే కాకుండా ఆ క్రికెటర్‌పై చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నిరోజులు ఈ విషయాన్ని దాచిన చాహల్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి గురువారం ఈ సంచలన నిజాన్ని వెల్లడించాడు. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

2013లో ముంబయి జట్టు తరఫున ఆడిన నేను బెంగళూరులో ఓ మ్యాచ్‌ గెలిచాక పార్టీ చేసుకున్నాం. ఆ టైంలో ఫుల్లుగా తాగిన ఒక క్రికెటర్‌ నన్ను ఎత్తుకుని బాల్కనీలో 15వ అంతస్తులో వేలాడదీశాడు. అప్పుడు నా చేతులతో అతడి మెడను గట్టిగా పట్టుకున్నా. అప్పుడు కొంచెముంటే నా పని అయిపోయేది. వెంటనే అక్కడున్న తోటి క్రికెటర్లు స్పందించి అతన్ని అడ్డుకోవడంతో బతికిపోయా. లేకపోతే పెను ప్రమాదమే జరిగుండేదని చాహల్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే తొలుత ముంబయికి జట్టుకు ఆడిన చాహల్‌.. ఆ తర్వాత బెంగళూరు టీమ్ తరఫున ఆడాడు. అక్కడ కీలక స్పిన్నర్‌గా మంచి గుర్తింపు దక్కించుకొని ఆ జట్టులో అంతర్భాగమయ్యాడు. అయితే, ఈ సీజన్‌కు ముందు బెంగళూరు వదిలేయడంతో మెగా వేలంలో చాహల్‌ను రాజస్థాన్‌ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుత టోర్నీలో ఆ జట్టు తరఫున ఆడుతోన్న చాహల్‌ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసి రాణిస్తున్నాడు.

Advertisement

Next Story