Drugs Case: డ్రగ్స్ కేసు.. సీఎస్, ఎక్సైజ్ డైరెక్టర్‌లకు హైకోర్టు నోటీసులు

by GSrikanth |   ( Updated:2022-04-07 07:07:26.0  )
Drugs Case: డ్రగ్స్ కేసు.. సీఎస్, ఎక్సైజ్ డైరెక్టర్‌లకు హైకోర్టు నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణపై ఈడీ దూకుడు పెంచింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ శాఖ సమర్పించకపోవడంపై ఈడీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదని, సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌కు కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ధర్మాసనాన్ని కోరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సీఎస్, ఎక్సైజ్ డైరెక్టర్‌కు నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

Next Story

Most Viewed