ప్లాష్.. ప్లాష్.. ప్రమాదం నుంచి బయటపడ్డ గుత్తా సుఖేందర్ రెడ్డి

by Nagaya |
ప్లాష్.. ప్లాష్.. ప్రమాదం నుంచి బయటపడ్డ గుత్తా సుఖేందర్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా శివారులో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నల్లగొండ వెళ్తుండగా.. రామోజీ ఫిల్మ్ సిటీ వద్దనే రాగానే ఆయన కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. గుత్తా సుఖేందర్ రెడ్డి కారు ముందు వెళ్తున్న మరోకారు సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుత్తా సుఖేందర్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్‌లోని మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కాగా, ఈ ప్రమాదం అనంతరం గుత్తా నల్లగొండ వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లారు. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గుత్తా క్షేమంగా బయటపడటంతో టీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

Advertisement

Next Story