- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లింబో స్కేటింగ్‌లో ఏడేళ్ల చిన్నారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
దిశ, ఫీచర్స్ : పుణెకు చెందిన ఏడేళ్ల దేశ్నా నహర్ అతి తక్కువ సమయంలో 20 కార్ల కింద నుంచి లింబో స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. రోలర్ లింబో స్కేటింగ్‌గా పిలువబడే ఈ క్రీడకు సంబంధించి 193 అడుగుల స్ట్రెచ్‌లో భాగంగా.. దేశ్న కేవలం13:74 సెకన్ల వ్యవధిలో ఈ ఫీట్ పూర్తిచేసింది. ఈ మేరకు 2015లో 14 ఏళ్ల చైనీష్ గర్ల్ 14:15 సెకన్లలో నమోదు చేసిన రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందంతో మాట్లాడిన ఆమె పేరెంట్స్.. థర్డ్ క్లాస్ చదువుతున్న దేశ్న ఐదేళ్ల వయసులోనే స్కేటింగ్‌పై దృష్టి పెట్టిందన్నారు. ముఖ్యంగా ఈ రికార్డ్ కోసం గత నెల రోజులుగా పుణె, కత్రాజ్ కోంధ్వా రోడ్డులోని తన శిక్షణా కేంద్రంలో ప్రాక్టీస్ చేస్తోందని ఆమె కోచ్ చెప్పింది. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక పోటీల్లో పాల్గొన్న దేశ్న.. సుమారు 16 సర్టిఫికెట్లు, 40 పతకాలను అందుకోవడం విశేషం.