- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైకిల్ తొక్కుతూ రూబిక్ క్యూబ్ సాల్వింగ్.. గిన్నిస్ రికార్డ్
దిశ, ఫీచర్స్ : తమిళనాడుకు చెందిన బాలుడు.. సైకిల్ రైడ్ చేస్తూనే రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసి రికార్డ్ సృష్టించాడు. 14.32 సెకన్ల వ్యవధిలోనే పజిల్ క్యూబ్‌ను సెట్ చేసిన జయదర్శన్ వెంకటేషన్.. అత్యంత వేగంగా ఈ ఫీట్ పూర్తిచేసి గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ఇన్‌స్టా పేజీలో షేర్ చేసింది. చెన్నై నివాసి అయిన వెంకటేషన్.. గతేడాది నవంబర్‌లో ఓవైపు సైకిల్ తొక్కుతూ మరోవైపు తన ఇంటెలిజెన్స్, క్లాసిక్ మూవ్స్‌ను ఉపయోగిస్తూ రూబిక్‌లోని నిలువు రంగులను సెకన్లలో మ్యాచ్ చేసి అబ్బురపరిచాడు. వెంకటేషన్ పూర్తిచేసిన ఫీట్ తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో నమోదు కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు బాలుడిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. 'జీనియస్'గా అభివర్ణిస్తున్నారు. అయితే గిన్నిస్ రికార్డ్స్ టైటిల్ సాధించేందుకుగాను ఈ చెన్నై బాలుడు తన స్పీడ్ సాల్వింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకునేందుకు రెండేళ్లపాటు శ్రమించాడు.
ఇతర రూబిక్స్ క్యూబ్ రికార్డ్స్..
సైకిల్ తొక్కేటప్పుడు రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించడం ఒక ఫీట్ అయినప్పటికీ చరిత్రలో విచిత్రమైన, విస్మయానికి గురిచేసే రికార్డ్ కాదు. ఈ కేటగిరీలో అరుదైన రికార్డుల విషయానికొస్తే.. 2018లో చైనాకు చెందిన 13 ఏళ్ల క్యూ జియాన్యు ఏకకాలంలో మూడు రూబిక్స్ క్యూబ్‌లను గారడీ చేస్తూ 5 నిమిషాల 2.43 సెకన్లలో సాల్వ్ చేసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాడు. అంతకన్నా ముందు తన రెండు చేతులు, కాళ్లతో మూడు రూబిక్స్‌ను 15.84 సెకన్లలో పూర్తిచేసి రికార్డుకెక్కాడు.