- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
by Web Desk |
X
దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలువురు రోగులు అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.13 లక్షల 84 వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను 31 మంది లబ్ధిదారులకు శుక్రవారం ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ సర్కార్ పనిచేస్తుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం లా ఆదుకుంటుందన్నారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఎర్ర గుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story