Ram Charan: షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన గ్లోబల్ స్టార్.. ఏ సినిమా కోసమంటే?

by Hamsa |
Ram Charan: షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన గ్లోబల్ స్టార్.. ఏ సినిమా కోసమంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. గత మూడున్నరేళ్ల నుంచి రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్‌లో ‘గేమ్ చేంజర్’ (game changer)మూవీ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని క్రిస్మస్(Christmas) కానుకగా విడుదల కాబోతుంది. దీంతో సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ చేంజర్ విడుదల కాకుండానే గ్లోబల్ స్టార్ బుచ్చిబాబు(Buchi Babu) ప్రాజెక్ట్ ఒకే చేశారు. అయితే ఇది RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనుంది.

దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆగస్టులో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్(Jahnvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు టాక్. ఈ క్రమంలో.. తాజాగా, రామ్ చరణ్(Ram Charan) లుక్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గుబురు గడ్డంతో చరణ్ కనిపించడంతో అభిమానులు బుచ్చిబాబు(Buchi Babu) సినిమా కోసమే అని ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ మూవీలో బీస్ట్ మోడ్‌లోకి మారబోతున్నట్లు ఇటీవల చరణ్ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story