ఎట్టకేలకు ప్రభాస్‌ పెళ్లిపై గుడ్‌ న్యూస్‌ చెప్పిన శ్యామలాదేవి.. ఇకపై అన్ని వరుస సెలబ్రేషన్సే అంటూ..

by Kavitha |   ( Updated:2024-10-23 02:22:22.0  )
ఎట్టకేలకు ప్రభాస్‌ పెళ్లిపై గుడ్‌ న్యూస్‌ చెప్పిన శ్యామలాదేవి.. ఇకపై అన్ని వరుస సెలబ్రేషన్సే అంటూ..
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ వచ్చిన ‘కల్కి2898ఏడీ’(kalki2898AD) మూవీతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే 'సలార్2'(Salar2), 'కల్కి2'(Kalki2), 'ఫౌజి'(Fauji), 'రాజాసాబ్'(Rajasaab), 'స్పిరిట్'(spirit) వంటి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఈ రోజు డార్లింగ్ పుట్టిన రోజు అనే సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభాస్ నటించిన 'డార్లింగ్'(darling), 'ఈశ్వర్'(Eeshwar) వంటి సినిమాలను రీ రిలీజ్ కూడా చేస్తున్నారు. అలాగే డార్లింగ్ బర్త్‌డే అంటే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ అంతా ఇంతా ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

బేసిక్‌గా ప్రభాస్‌ పెళ్లి అనేది పెద్ద మిస్టరీగా సాగుతుంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో క్లారిటీ లేదు. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అనేలానే వ్యవహారం నడుస్తోంది. కానీ ప్రభాస్‌ నుంచి దీనిపై క్లారిటీ లేదు. మొన్నటి వరకు పెదనాన్న కృష్ణంరాజు(Krishamraju) స్పందించేవారు. చూస్తున్నామని, చేస్తామని చెబుతూ వచ్చేవారు. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నామనే వారు. ఆయన చనిపోయారు, ఇప్పుడు పెద్దమ్మ శ్యామలాదేవి వంతు వచ్చింది. ఆమెకి ఈ ప్రశ్నలు తరచూ ఎదురవుతున్నాయి. ఆమె కూడా అలానే చెబుతూ వస్తుంది.

తాజాగా మరోసారి ప్రభాస్‌ పెళ్లిపై స్పందించింది శ్యామలాదేవి(Shyamaladevi). ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు ఉండబోతుందో అనేది ఆమె వెల్లడించే ప్రయత్నం చేసింది. ఆమె ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో చిట్‌ చాట్‌లో డార్లింగ్‌ పెళ్లిపై రియాక్ట్ అయ్యింది. మ్యారేజ్‌ చేస్తామని, చేయాలని తనకు కూడా ఉందని, ఆ శుభ గడియలు కచ్చితంగా వస్తాయని తెలిపింది. ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ, `కల్కి 2898 ఏడీ` సినిమా వచ్చి పెద్ద హిట్‌ అయ్యింది. ఆ సక్సెస్‌ని మనం అందరం ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఆ విజయ పరంపర సాగుతూనే ఉంటుంది. ఇకపై అన్నీ ఆనందాలే అని తెలిపింది శ్యామలా దేవి.

అయితే పెళ్లి ఉంటుందని, రాబోయేవన్నీ మంచి రోజులే అని, ఆనందాలే అని చెప్పింది. కానీ పెళ్లి ఎప్పుడు ఉంటుందనేది మాత్రం కచ్చితంగా చెప్పలేకపోయింది. కాకపోతే ప్రభాస్‌ మ్యారేజ్‌పై ఆమె మాటలు కొంత హోప్‌ ఇచ్చేలా ఉన్నాయి. పెళ్లి ఉండబోతుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరి నిజంగానే ఉంటుందా..? ఆ విషయంలో కొంతైనా ముందడుగు పడుతుందా..? అనేది చూడాలి. కాగా ఈ శుభవార్త కోసం మాత్రం ఫ్యాన్స్ ఎంతో మంది ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed