- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక జట్టుగా

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ విజయవంతమైన జట్టు. ఐదుసార్లు టైటిల్ సాధించింది. చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో కలిసి సంయుక్తంగా అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా ఉన్నది. ఈ సీజన్‌లో ఆ జట్టు జోరు మీద ఉన్నది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలుపుతో ముంబై ఇండియన్స్ కీలక మైలురాయిని అందుకుంది. 150 విజయాలను పూర్తి చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. మొత్తం 271 మ్యాచ్‌లు ఆడిన ముంబై 150 విజయాలు నమోదు చేయగా.. 121 మ్యాచ్‌ల్లో ఓడింది. ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్ల జాబితాలో ముంబై తర్వాత చెన్నయ్ రెండో స్థానంలో ఉన్నది. 248 మ్యాచ్‌ల్లో సీఎస్కే 140 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్(261 మ్యాచ్‌ల్లో 134 విజయాలు), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(266 మ్యాచ్‌లలో 129 విజయాలు), ఢిల్లీ క్యాపిటల్స్(121 విజయాలు) జట్లు టాప్-5లో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్(117 విజయాలు), రాజస్థాన్ రాయల్స్(114 విజయాలు) 100 విజయాలు నమోదు చేసిన జట్ల జాబితాలో ఉన్నాయి.