- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వినూత్నంగా అభిమానం చాటుకున్న అభిమాని.. అర ఎకరంలో రామ్ చరణ్ చిత్రం
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : సినీ, రాజకీయ రంగాల్లోని వారికి అభిమానులు ఉండటం. ఆ అభిమానులు రకరకాల రూపాల్లో హీరోలు, నేతలపై తమ అభిమానాన్ని చాటుకోవడం సహజం. కానీ వినూత్నమైన ఆలోచనలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో జోగులాంబ గద్వాల జిల్లా గొర్లఖాన్ దొడ్డి గ్రామానికి చెందిన జయరాజ్ ఒకరు. స్వయంగా చిరంజీవి అభిమాని అయిన జయరాజ్ క్రమక్రమంగా ఆయన కుమారుడు, సినీ హీరో రామ్ చరణ్ వీరాభిమానిగా మారాడు.
ఈ క్రమంలోని గత 5 నెలల క్రితం రామ్ చరణ్‌ను కలవడానికి తన సొంతూరు నుండి కాలినడకన హైదరాబాదులోని రాంచరణ్ ఇంటి వరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతలో విషయం తెలుసుకున్న రామ్ చరణ్ జయరాజ్‌ను కలిసి అతని వివరాలు తెలుసుకున్నాడు. షార్ట్ ఫిలింలు తీయడంలో దిట్ట అయిన జయరాజుకు వీలునుబట్టి సినీరంగంలో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజుకు ఏదైనా ఒక వినూత్న బహుమతి ఇవ్వాలనుకున్న జయరాజ్ తమ వ్యవసాయ పొలంలో అర ఎకరానికి పైగా స్థలంలో రామ్ చరణ్ చిత్రం వచ్చేలా వరినాట్లు వేసాడు.
4-5 రోజుల పాటు శ్రమించి జయరాజు స్వయంగా రామ్ చరణ్ చిత్రాన్ని పొలంలో వేశాడు. విషయం తెలుసుకున్న అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు, తదితరులు జయరాజ్ గ్రామాన్ని సందర్శించి జయరాజు వేసిన చిత్రాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి జయరాజ్‌కు అభినందనలు తెలిపారు.
ఈనెల 27న రామ్ చరణ్ జన్మదిన వేడుకలు హైదరాబాద్లోని శిల్పారామంలో జరగనుండడంతో.. ఆ వేడుకలకు జయరాజ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన అభిమాని జయరాజ్‌ను ఘనంగా సన్మానించనున్నారు. ఇప్పటికైనా రామ్ చరణ్ నటించే ఓ సినిమాకు కథారచన చేయడంతోపాటు, దర్శకత్వం వహించడమే తన లక్ష్యమని జయరాజ్ అంటున్నాడు.