- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం: చింత ప్రభాకర్
దిశ, సదాశివపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింత ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం టీఆర్ఎస్ 23,24 వార్డులలో చింతా ప్రభాకర్ పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇటీవల నారాయణఖేడ్ సభలో సీఎం కేసీఆర్ సదాశివపేట అభివృద్ధికి మంజూరు చేసిన రూ.25 కోట్లను పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధికి కేటాయిస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో వివక్ష చూపరాదని సూచించారు.
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు చింత ప్రభాకర్ అని ప్రజలు కొనియాడారు. 23 వార్డ్‌లో ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్ లు ఇంద్ర మోహన్ గౌడ్, చౌదరి ప్రకాష్, గుండు రవి, ఆకుల శివ, విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ రాజేష్, మునిసిపల్ కోఆప్షన్ సభ్యులు అంజయ్య, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లి గుండ్ల వీరేశం, యువత అధ్యక్షుడు ప్రేమ్, నాయకులు రాజు, ప్రదీప్ జైన్, అర్జున్ గౌడ్,మైనారిటీ నాయకులు ముబీన్,కార్యకర్తలు పాల్గొన్నారు.