- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వైసీపీ పోరాట ఫలితమే 'హోంశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు': అంబటి రాంబాబు
దిశ, ఏపీ బ్యూరో : ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ అహర్నిశలు శ్రమిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం సర్వశక్తులు ఒడ్డుతోందని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీలు పోరాట పటిమతో విభజన హామీలు, హోదాపై కేంద్రం త్రిసభ్య కమిటీ వేయడం శుభ పరిణామం అని అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదన్నా తమ వాదన నిజమైందని చెప్పుకొచ్చారు.
వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా సాధిస్తామని సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోనే చెప్పారని అందుకోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల వద్ద హోదాతోపాటు పునర్విభజన చట్టంలోని హామీల అమలును గుర్తు చేస్తూనే ఉన్నారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్యాకేజీ తీసుకొని హోదాకు తిలోదకాలిచ్చారని విమర్శించారు. వైసీపీ పోరాట ఫలితమే హోదా అంశం మళ్లీ తెరపైకి వచ్చిందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు.