డ్రగ్స్ ఎఫెక్ట్ : రాడిసన్​హోటల్​లైసెన్స్​ రద్దు

by Nagaya |
డ్రగ్స్ ఎఫెక్ట్ : రాడిసన్​హోటల్​లైసెన్స్​ రద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాడిసన్​ హోటల్‌లోని పుడింగ్​ మింక్​ పబ్‌లో రేవ్​పార్టీ వ్యవహారంలో ప్రభుత్వం స్పందించింది. ఈ హోటల్​కు చెందిన బార్​ లైసెన్స్​ను రద్దు చేసింది. అదేవిధంగా పబ్‌ను​కూడా రద్దు చేసింది. పబ్​, లిక్కర్​ రెండు లైసెన్స్​లు రద్దు చేసినట్లు ఆబ్కారీ శాఖ సర్క్యులర్​ జారీ చేసింది. బంజారా హిల్స్ ప‌రిధిలో ఏళ్ల త‌ర‌బ‌డి కార్యక‌లాపాలు సాగిస్తున్న రాడిస‌న్ హోట‌ల్ పైఅంత‌స్తులో ఉన్న పబ్‌లో డ్రగ్స్ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌బ్‌పై పోలీసుల దాడి చేసిన కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో ప‌లువురు ప్రముఖుల బంధువుల పేర్లు ఒక్కటొక్కటిగా బ‌య‌ట‌ప‌డుతున్న నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కారు రాడిస‌న్ హోట‌ల్ లైసెన్స్‌ను ర‌ద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుని, ఆబ్కారీ శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో రాడిసన్​ లైసెన్స్​లు రద్దు చేసినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story