అక్కినేని అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్..!

by Hamsa |
అక్కినేని అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్..!
X

దిశ, సినిమా: అక్కినేని హీరో అఖిల్(Akhil) ‘సిసింద్రీ’(Sisindri) సినిమాతో సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 2015లో ‘అఖిల్’ మూవీతో హీరోగా మారాడు. మిస్టర్ మజ్ను(Mr Majnu), మోస్ట్ బ్యాచిలర్, హలో, మనం(Manam) వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు కానీ బిగ్గెస్ట్ హిట్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. అఖిల్ గత ఏడాది ‘ఏజెంట్’(agent) మూవీతో వచ్చి భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకుని.. సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. నిత్యం ఆయన తదుపరి ప్రాజెక్ట్ రాబోతున్నట్లు వార్తలు రావడం తప్ప అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అంతేకాకుండా అఖిల్ సినీ కెరీర్ ముగిసినట్లే అని చర్చించుకోవడం మొదలెట్టాడు.

ఈ క్రమంలో.. తాజాగా, అక్కినేని అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు. అఖిల్(Akhil) రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. అనిల్ కుమార్(Anil Kumar) అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీనిని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని టాక్. దీంతోపాటు ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ (Murali Kishore)డైరెక్షన్‌లో మరో మూవీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) నిర్మిస్తుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రజెంట్ అఖిల్ సినిమాలకు సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో అది చూసిన అఖిల్(Akhil) ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. అఖిల్ అన్నయ్య అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభితతో ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో వీరి పెళ్లి జరగనుంది. అయితే అఖిల్ పెళ్లి విషయాన్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తాడా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story