- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
bananas: ఖర్జూరంతో బనానా కలిపి తింటున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

దిశ, వెబ్‌డెస్క్: ఖర్జూరం ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.వీటితో ఐరన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం,ప్రొటీన్, పొటాషియం, విటమిన్ బి-6 పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో ఐరన్ కంటెంట్ పెరగడం నుంచి రక్త ఉత్పత్తిని ఉత్తేజపరిచే వరకు ఖర్జూరాలు అనేక ప్రయోజనాల్ని అందిస్తాయి.
ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మంచివని కాగా ప్రతిరోజూ తినాలని తరచూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా శక్తిని పెంచడంలో.. ఇమ్మూనిటీ పవర్ ను పెంచడంలో బాగా పని చేస్తాయి. వీటితో పాటు జ్వరం లక్షణాల్ని తగ్గిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని దూరం చేయడంలో ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి.
అంతేకాకుండా ఖర్జూరాలు రక్త ఉత్పత్తిని పెంచడంలో, రుతుక్రమ సమయంలో వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. ఒకవేళ పిల్లలకు నిద్రలో మూత్ర విసర్జన ప్రాబ్లమ్స్ ఉంటే ఖర్జూరాలతో పాటు పాటు కలిపి ఇస్తే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
అయితే ఖర్జూరంతో బనానా కలిపి తింటే ఆరోగ్యానికి మేలేనా? నష్టమా అని నిపుణులు చెప్పిన విషయాలు ఓసారి చూద్దాం.. వాస్తవానికి అరటి పండు హెల్త్ కు చాలా మంచివి. బనానా తింటే ఫుడ్ తొందరగా డైజెషన్ అవుతుంది. వీటిలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు .. ఇలా అనేక పోషకాలు దట్టంగా ఉంటాయి.
అయితే ఖర్జూరంతో బనానా కలిపి తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఇలా తింటే పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కాగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. పాలు, బనానా, ఖర్జూరంతో చేసిన మిల్క్ షేక్ తాగితే రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు. అలసట అనేది దూరం అవుతుంది. ఈ రెండింటిలో ఉండే కాల్షియం, ఐరన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.
బనానా, ఖర్జూరం కలిపి తినడం వల్ల రక్తహీనత అనేది తొలగిపోతుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. అయితే ఈ రెండింటితో తయారు చేసిన జ్యూస్ పరగడుపున తాగితే అనేక లాభాలున్నాయి నిపుణులు చెబుతున్నారు. సన్నగా ఉన్నవార తరచూ బనానా, ఖర్జూరాలు తింటే వెయిట్ కూడా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.