Breaking: నల్గొండలో దారుణం.. కలర్ ల్యాబ్ ఓనర్ సురేశ్ హత్య

by srinivas |   ( Updated:2025-04-12 02:19:38.0  )
Breaking: నల్గొండలో దారుణం.. కలర్ ల్యాబ్ ఓనర్ సురేశ్ హత్య
X

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే గుర్తుతెలియని దుండగులు వేటకొడవల్లతో ఓ వ్యక్తిని నరికి చంపేశారు. గీతాంజలి కాంప్లెక్స్ లో సురేష్(37) మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ ఓనర్ నిర్వహిస్తున్నాడు. రాత్రి సమయంలో సురేష్ ల్యాబ్ లో ఉండగా, గుర్తు తెలియని దుండగులు మాస్కులతో వచ్చి వేట కత్తులతో ఒక్కసారిగా దాడిచేశారు. గుండెలో, మెడపై దారుణంగా నరికారు. తప్పించుకునే ప్రయత్నం చేసినా, దుండగులు వదిలిపెట్టలేదు. కుటుంబ కలహాలా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ శివరాం రెడ్డి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story