'NBK109' నుంచి అదిరిపోయే అప్‌డేట్.. నవంబర్ 15న రెడీగా ఉండండి అంటూ పోస్ట్

by sudharani |   ( Updated:2024-11-12 14:30:04.0  )
NBK109 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. నవంబర్ 15న రెడీగా ఉండండి అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: ఈ ఏజ్‌లో కూడా యంగ్ హీరోలకు టఫ్ ఫైట్ ఇస్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. ప్రజెంట్ తన 109వ చిత్రం ‘NBK109’ కోసం సిద్ధం అవుతున్నాడు. బ్లాక్ బస్టర్ (blockbuster) డైరెక్టర్ బాబీ (Bobby) కొల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కేవలం ప్రకటనతోనే భారీ హైప్ (huge hype) ఏర్పడింది. అంతే కాకుండా.. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా బాలయ్యబాబు మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దర్శనం ఇవ్వడంతో అందరూ ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమా టైటిల్‌తో పాటు మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ (Updates) కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఈగర్‌గా ఎదుచూస్తోన్న ఈ చిత్ర టైటిల్‌ టీజర్ (Title Teaser)కి ముహూర్తం ఖరారైంది. కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా, నవంబర్ (November) 15న 'NBK109' టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ (poster) ఆకట్టుకుంటోంది. ఇందులో విభిన్న దుస్తులు ధరించి, నెత్తురంటిన గొడ్డలిని పట్టుకొని, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో నిల్చొని ఉన్న బాలయ్యబాబు రూపం శక్తివంతంగా ఉంటంతో పాటు.. వేరే లెవల్‌లో ఆకట్టుకుంటోంది. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అంచనాలను ఎన్నో రెట్లు పెంచేలా ఉంది. కాగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (Sitara Entertainments), ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ (FortuneFour Cinemas) పతాకాలపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamshi), సాయి సౌజన్య నిర్మిస్తున్న 'NBK109'లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం, 2025 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Read More ...

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. NBK 109 నుంచి టైటిల్, టీజర్ డేట్ ఖరారు..!!

Advertisement

Next Story