- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబర్ నేరగాడికి చిక్కిన రెడ్ మిక్స్ వ్యాపారి
దిశ, నల్లగొండ: నల్లగొండ లో ఓ వ్యక్తి ఖాతా నుంచి నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేశారు. ఆలస్యంగా తేరుకున్న బాధితుడు సైబర్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం పల్లటి సురేందర్ రెడ్డి అద్దంకి- నార్కెట్ పల్లి హైవే లెప్రసీ కాలనీ సమీపంలో కాంక్రీట్ వ్యాపారం చేస్తున్నారు. నల్లగొండ కేంద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్లే గ్రౌండ్ లో కాంక్రీట్ కావాలంటూ రెడీమిక్స్ వ్యాపారి సురేందర్ రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ లో ఆర్డర్ చేశారు. వెంటనే కాంక్రీట్ వెహికిల్, తన దగ్గర సూపర్ వైజర్‌గా పని చేసే మిర్జాయాసిన్ అలీ బేగ్‌ను వెంట ఇచ్చి కేంద్రీయ విద్యాలయం దగ్గరకు పంపాడు.
తాను రావడనికి కుదరడం లేదని, ఆన్లైన్లో క్యాష్ ఉన్నాయని క్యూఆర్ కోడ్ పంపి, తాను పంపిన లింక్ ఓపెన్ చేయమని మోసగాడు కోరాడు. అక్కడికి వెళ్లిన మిర్జా యాసిన్ ఆన్లైన్ లింక్ ఓపెన్ చేయగానే అకౌంట్‌లో ఉన్న రూ.1,22,382 లక్షల డబ్బు ఐదు దఫాలుగా కట్ అయ్యాయి. వెంటనే బాధితుడు తనకు వచ్చిన నెంబర్ 9669674135కు ఫోన్ చేశాడు. రింగ్ అవుతున్న సైబర్ నేరస్తులు లిఫ్ట్ చేయడం లేదు. దీంతో వెంటనే టూ టౌన్ పోలీసులను సంప్రదించగా, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సహాయంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంపిన రెడ్ మిక్స్ గట్టిపడి వృథాగా మారింది. దాని విలువ రూ.32 వేలు ఉంటుందని బాధితుడు చెప్పాడు. గతంలోనూ మిర్యాలగూడ, చిట్యాల, నార్కట్ పల్లిలోనూ ఈ తరహా మోసాలకు పాల్పడ్డారు.
బ్యాంకు ఖాతా వివరాలు చెప్పి మోసపోవద్దు...
బ్యాంకు ఖాతా వివరాలు చెప్పి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. రెడ్ మిక్స్ బాధితుడి ఫిర్యాదు మేరకు జిల్లా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, టూ టౌన్ పోలీస్ సహాయంతో సైబర్ కస్టమర్ కేర్ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయించామని, ఎన్సీఆర్పీ పోర్టల్ లో నమోదు చేశామని చెప్పారు. ఏదైనా సైబర్ నేరం జరిగినప్పుడు కంగారు పడకుండా ఏటీఎం కార్డ్ వివరాలు బ్లాక్ చేసి, 24 గంటల లోపు ఎపమన్సీఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరస్తులు సులువుగా ట్రాప్‌లో పడేసే మార్గాలు తెలుసుకొని, ఎలాంటి క్యూ ఆర్‌లు స్కాన్ చేయకుండా, ఓటీపీ చెప్పకుండా సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ సూచించారు.