సిటీల్లో 'కరోనా డేంజర్'.. బయటకు రావొద్దని హెచ్చరిక!

by GSrikanth |
సిటీల్లో కరోనా డేంజర్.. బయటకు రావొద్దని హెచ్చరిక!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సిటీల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్నది. రంగారెడ్డి, హైదరాబాద్‌లో కొవిడ్​తీవ్రత రెట్టింపయింది. శుక్రవారం 29,084 మందికి కరోనా పరీక్షలు చేయగా, 493 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారి నుంచి 219 మంది కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 3,322 యాక్టివ్ కేసులున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లోనే నగరంలో కొవిడ్ బారిన పడినవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో పాజిటివ్​రేట్ 3.62 శాతం చొప్పున రికార్డు కాగా, హైదరాబాద్‌లో 2.98 %గా కొనసాగుతున్నది. ఈ నెల మొదటి, రెండో వారాలతో పోల్చితే పాజిటివిటీ రేట్ డబుల్ కావడం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక పాజిటివ్​రేట్​ఈ రెండు జిల్లాల్లోనే తేలుతున్నది. అంతేగాక ఈ నెల 17 నుంచి 20 జిల్లాల్లో కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నది. అయితే అర్బన్ ఏరియాల్లోనే ఎక్కువ నమోదు కావడం గమనార్హం. మొదటి వేవ్​తరహాలోనే వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్నదని ఎపిడమాలజిస్టులు పేర్కొంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ కూడా అలెర్ట్‌ను జారీ చేసింది. మాస్కు, భౌతిక దూరం తప్పనిసరి అంటూ నొక్కి చెప్పింది. వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, చిన్నారులు అత్యవసరమైతే తప్పా, బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది.

0.97% నుంచి 1.33% కి..

ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,29,944 మందికి టెస్టులు చేయగా, 1,264 మందికి పాజిటివ్‌గా తేలింది. అంటే పాజిటివ్ రేట్ 0.97%గా నమోదైంది. మరోవైపు ఈ నెల 17వ తేదీ నుంచి 23 వరకు 1,76,072 శాంపిళ్లకు టెస్టులు చేయగా 2339 మందికి వైరస్ తేలింది. పాజిటివ్ రేట్ 1.33%గా రికార్డు అయింది. అయితే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి, వికారాబాద్, కొమరం భీం ఆసీఫాబాద్, మహబూబ్​నగర్, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మంచిర్యాల, సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నారాయణపేట, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో రోజువారీ కేసులు రెట్టింపు కావడం ఆందోళన కల్గించే అంశం.

సీజనల్ సింప్టమ్స్ ఉన్నా టెస్టులు: డీహెచ్ డాక్టర్ జీ శ్రీనివాసరావు

కొవిడ్, సీజనల్ వ్యాధులు సింప్టమ్స్ ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయి. దీంతో చాలా మంది టెస్టులకు ఆలస్యంగా వెళ్తున్నారు. దీని వలన శరీరంలో వైరస్​ తీవ్రత పెరిగే ప్రమాదం ఉన్నది. దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు, జ్వరం, విరేచనాలు, అలసత్వం తదితర ఏ లక్షణాలు ఉన్నా కరోనా టెస్టు చేపించుకోవాలి. పీహెచ్‌సీల నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకు అన్నింటిలో టెస్టింగ్ కిట్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో పాటు మెడిసిన్స్ కిట్లూ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఎండమిక్ స్టేజ్‌లో ప్రతి ఆరు నెలలకోసారి కేసుల్లో సర్జ్​ కనిపిస్తుంది. కొంతకాలం పాటు ఇది కొనసాగుతుంది. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ప్రజలెవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

కేసులు తీవ్రత ఇలా...




Next Story

Most Viewed