గ్రామీణ ఉత్పత్తులను కొందాం.. వారిని ప్రోత్సహిద్దాం

by Vinod kumar |
గ్రామీణ ఉత్పత్తులను కొందాం.. వారిని ప్రోత్సహిద్దాం
X

దిశ, వనపర్తి: గ్రామీణ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వారిని ప్రోత్సహించిన వారమవుతామనీ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో నాబార్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మహా గ్రామీణ మేళాను జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా సందర్శించారు. గ్రామాల నుంచి మహిళా సంఘాల ద్వారా తయారు చేయబడిన ఆహార, వస్త్ర, అలంకరణ, పూల మొక్కలు, ఉత్పత్తుల ప్రదర్శన శాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో నాబార్డ్ గ్రామీణ మహా మహిళా మేళా నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. మహిళా సంఘాలు, యువజన సంఘాలు, గ్రామాల్లో సహజ సిద్ధంగా లభించే వనరులను తమ సృజనాత్మకతతో ప్రజా వినియోగ ఉత్పత్తులను తయారు చేసి అందించడం శుభపరిణామం అన్నారు. కాలుష్య రహిత సమాజం, పర్యావరణ రక్షణకు దోహదపడే గ్రామీణ ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయాలని తెలిపారు. నిమ్మ గడ్డి తో టి, వేరుశనగ పుట్టుతో అలంకరణ ఉత్పత్తులు సృజనాత్మకతను తెలిపేలా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సుధాకర్ రెడ్డి, నాబార్డ్ డీడీఎం నాగార్జున, డీపీఎం లు ప్రభాకర్, బాష్య నాయక్, గ్రామీణ మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed