- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్జాతీయ బాధ్యతలను చైనా, యూఎస్ భుజానికెత్తుకోవాలి.. జిన్‌పింగ్
వాషింగ్టన్/బీజింగ్: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనాలు ప్రపంచ శాంతి స్థాపనకు అంతర్జాతీయ బాధ్యతలను భుజానికెత్తుకోవాలని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సూచించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా, చైనా అధ్యక్షులు శుక్రవారం వీడియో కాల్ ద్వారా సంభాషించుకున్నారు. దాదాపు 2గంటల పాటు(1:50గంటలు) సాగిన వీరి సమావేశంలో జిన్‌పింగ్ మాట్లాడుతూ.. యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని, ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలు ఎవరికీ మేలు చేకూర్చవని, ఇది ఎవరూ చూడదనుకునే సంక్షోభమని వెల్లడించారు.
అంతర్జాతీయ సమాజంలో శాంతి, భద్రత అనేవి అత్యంత విలువైన సంపద అని చెప్పిన జిన్‌పింగ్.. వాటిని నెలకొల్పే బాధ్యతను ఇరు దేశాలు పంచుకోవాలని సూచించారు. అలాగే, చైనా, అమెరికాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను సరైన మార్గంలో పయనించేలా చూడాలని అన్నారు. ఘర్షణల నడుమ దేశాల మధ్య సంబంధాలు పురోగతి సాధించలేవని తెలిపారు. ఈ విషయాన్ని చైనాకు చెందిన మీడియా సంస్థ సీసీటీవి తెలిపింది.