రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో కెయిర్న్ ఎనర్జీ రూ. 7,900 కోట్లు చెల్లించిన కేంద్రం!

by Disha Desk |
రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో కెయిర్న్ ఎనర్జీ రూ. 7,900 కోట్లు చెల్లించిన కేంద్రం!
X

దిశ, వెబ్‌డెస్క్: రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో భాగంగా కెయిర్న్ ఎనర్జీ కంపెనీకి భారత ప్రభుత్వం రూ. 7,900 కోట్లను రీఫండ్ చేసినట్టు కంపెనీ గురువారం వెల్లడించింది. పాత తేదీల నుంచి విధించే పన్ను వివాదంలో ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్‌పై వేసిన అన్ని కేసులను వెనక్కి తీసుకున్న తర్వాత ప్రక్రియ ముగిసిందని కంపెనీ పేర్కొంది. 2006 కెయిర్న్ఎనర్జీ సంస్థ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్ర పన్నుల విభాగం నోటీసులు ఇచ్చింది. దీనిపై 2015లో ఆదాయ పన్ను శాఖ రూ. 10,247 కోట్లు చెల్లించాలని కంపెనీని కోరింది. అలాగే, పునర్‌వ్యవస్థీకరణ మూలంగా వచ్చిన మూలధన రాబడిపై కూడా పన్ను చెల్లించాలని స్పష్టం చేసింది. దీనికి ముందు 2010లో కెయిర్న్ ఎనర్జీ తన భారత విభాగాన్ని వేదాంత సంస్థకు విక్రయించింది. ఇందులో భాగంగా వేదాంతలో ఐదు శాతం వాటాలను ఇచ్చారు. ఈ ఐదు శాతం షేర్లను కూడా కేంద్రం ఫైల్ చేసింది. అనంతరం రూ. 1,140 కోట్ల డివిడెండ్, రూ. 1,590 కోట్ల ట్యాక్స్ రీఫండ్ నిలిపేసింది. ఆ తర్వాత పరిణామాల్లో కెయిర్న్ ఎనర్జీ సంస్థ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. భారత ప్రభుత్వం నిలిపేసిన డివిడెండ్, ట్యాక్స్ రీఫండ్, షేర్ల అమ్మకం వల్ల జరిగిన నష్టం తమకే చెల్లించాలంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత అనేక కారణాల మధ్య గతేడాది భారత ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్‌ పన్నును రద్దు చేసిన కారణంగా కేంద్రం కంపెనీకి రీఫండ్ సొమ్మును చెల్లించింది.

Advertisement

Next Story

Most Viewed