- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'అదో జాతీయ పార్టీ... దానికో అధ్యక్షుడు.. ఫుట్ పాత్ గాళ్లను ఎమ్మెల్యేలుగా పెట్టుకుండ్రు'
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం, స్పీకర్, సీఎస్ పై ఈర్ష్య, ఆక్రోశంతో, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారని, తప్పుడు వ్యాఖ్యలు చేసేవారిపై ప్రివిలేజస్ కమిటీలో చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేవీ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. బడ్జెట్ పై బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మహిళలకు, రైతులు, యువతకు ఇది భరోసా కల్పించే బడ్జెట్ అన్నారు. తెలంగాణ ఫార్మెషన్ డే ను బ్లాక్ డేగా పార్లమెంట్ లో అభివర్ణించి అమరుల త్యాగాలను అవమాన పరిచ్చారన్నారు. పీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పీఎంను క్షమించే పరిస్థితి లేదన్నారు.
బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనుగడ ఉండదనే అందరిని టార్గెడ్ చేస్తున్నారని ఆరోపించారు. ఫుట్ పాత్ గాళ్లను ఎమ్మెల్యేలుగా పెట్టుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అదో జాతీయపార్టీ... దానికో అధ్యక్షుడు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేసేవారిని ప్రివిలేజస్ కమిటీ ముందుకు పిలిచి చర్యలు తీసుకోవాలని కోరారు. దుండిగల్ మున్సిపాలిటీకి బస్తీ దవాఖానా మంజూరు చేయాలన్నారు.