- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్ నడిబొడ్డున భారీ రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విన్నర్?

దిశ, వెబ్‌డెస్క్: జల్సాలకు అలవాటుపడిన కొందరు యువతీ, యువకులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున భారీ రేవ్ పార్టీ నిర్వహించారు. వీకెండ్ కావడంతో బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. అయితే, ఈ పార్టీ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు, అందులో డ్రగ్స్ కూడా వాడినట్లు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు పబ్‌పై దాడులు చేశారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం 150 మంది యువతీ, యువకులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, ఈ రేవ్ పార్టీలో బిగ్‌బాస్ సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్లు సమాచారం. అరెస్టైన వారిలో 39 మంది యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ దాడులు నిర్వహించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.