Exercise for Thigh Fat: తొడ కండరాల్లో కొవ్వు పెరుకుపోయిందా.. ఈ ఎక్సర్‌సైజులతో తగ్గించండి!

by Anjali |   ( Updated:2024-12-11 15:38:23.0  )
Exercise for Thigh Fat: తొడ కండరాల్లో కొవ్వు పెరుకుపోయిందా.. ఈ ఎక్సర్‌సైజులతో తగ్గించండి!
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతమందికి తొడల భాగం(Thigh part)లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. వారు నడవాలన్నా.. పరిగెత్తాలన్నా కాస్త కష్టంగా ఉంటుంది. కొవ్వు ఉండటం వల్ల తొడలు లావుగా కనిపిస్తాయి. దీంతో ముఖ్యంగా అమ్మాయిలు కొన్ని డ్రెసెస్ ధరిస్తే లుక్ సరిగ్గా కనిపించదు. ఈ కారణంతో నలుగురిలో ఇబ్బందిపడుతుంటారు. షార్ట్స్ లాంటివి ధరించేందుకు కూడా వెనకాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాగా ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ వ్యాయామాలు(exercises) చేస్తే చాలంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం..

లంజెస్ వ్యాయామం(Lunges exercise)..

ఈ వ్యాయామం కోసం ఫస్ట్ రెండు చేతులను నడుము మీద పెట్టుకుని ఎడమ కాలును ముందుకు ఉంచి.. మోకాలిని వంచాలి. తర్వాత మోకాలిని అరచేత్తో పట్టుకుని 5 సెకండ్లు ఉంచాలి. సేమ్ అలాగే మళ్లీ నిలబడిన పొజిషన్‌కు వచ్చి.. కుడి కాలుతో అలాగే చేయాలి.

బర్ఫీస్ వ్యాయామం(Burfee exercise)..

కొవ్వు తగ్గించడంలో బెస్ట్ ఎక్సర్‌సైజ్ బర్ఫీస్.జంప్ చేసి.. అనంతరం వంగి చేతులను నేలపై తాకించాలి. వెంటనే కిందకు తూలి పుష్ అప్ పొజిషన్ కు వెళ్లాలి. అనంతరం శరీరాన్ని పైకి లేపుతూ కూడా పుష్ అప్ చేయాలి.

స్క్వాట్స్(Squats)...

ఈ స్క్వాట్స్ వ్యాయామం వల్ల తొడలపై ఒత్తిడి పడుతుంది. ఇందుకోసం ముందుగా ఓ చోట నిల్చుని కాళ్లను దూరంగా ఉంచాలి. తర్వాత నడుమును వంచి.. కూర్చున్నట్లుగా వంగి ఉండాలి. వెనకాల చైర్ ఉన్నట్లుగా ఊహించుకుని ఈ పొజిషన్ లో ఉండాలి. దీంతో భాడీ భారమంతా కాళ్లపై పడుతుంది. కాగా తొందరగా తొడల కండరాల్లోని కొవ్వు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Read More...

Skipping for Height: స్కిప్పింగ్ చేస్తే నిజంగానే పొడవు పెరుగుతారా? ఇందులో వాస్తవమెంత?




Next Story

Most Viewed